2014 నుండి దొర పాలనలో, అవినీతి పెచ్చుమీరిపోయింది. కుటుంబ పాలనతో ప్రజలు
విసిగిపోయారు. ఉద్యమకారులను అణిచేసి ఉద్యమద్రోహులు అందలమెక్కారు. నీళ్లు
నిధులు నియామకాల ఉద్యమ నినాదం పక్కదారి పట్టింది.
దొర అసమర్థ విధానాల వల్ల ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్ప
అయింది. అన్నదాతల ఆర్తనాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. యువత భవిత
ఛిద్రమైంది. పాఠశాలల్లో కనీస వసతులు లేక భావి తెలంగాణ పౌరుల జీవితాలు
ఆగమైతున్నాయి. దొర అరాచక రాచరిక పాలన నుండి తెలంగాణను కాపాడుకోవలసిన సమయం
ఆసన్నమయింది.
తెలంగాణను ఇన్నేళ్ళుగా వంచిస్తున్న దొర అవినీతి పాలనపై ప్రజలను
చైతన్యపరిచేందుకే ‘సాలు దొర సెలవు దొర’ ఉద్యమం. అబద్ధపు హామీల పునాదుల
మీద బంగారు తెలంగాణ నిర్మిస్తామన్న దొర మోసపూరిత పోకడలను ఎండగట్టడానికి,
దొర పాలనలో జరిగిన అన్యాయాల మీద గళమెత్తడానికి కలిసి రండి. ఈ ఉద్యమంలో
పాలుపంచుకోండి. దొరను గద్దె దించే పోరాటంలో మీరూ భాగస్వాములు కండి.
దొర అరాచక పాలనకు సెలవు పలికేందుకు షేర్ చేయండి